city airways flight: విమానంలో ఇంధనం లీక్... సకాలంలో గుర్తింపు!

  • జెడ్డా నుంచి ఇండోనేషియా వెళ్తున్న సిటీ లింక్ ఎయిర్ వేస్ విమానం
  • ఇంధనం నిండుకోవడంతో శంషాబాద్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
  • ఇంధనం నింపుతుండగా లీక్ గుర్తింపు
హైదరాబాదులోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సిబ్బంది అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. జెడ్డా నుంచి ఇండోనేషియా వెళుతున్న సిటీ లింక్ ఎయిర్‌ వేస్‌ కు చెందిన విమానంలో ఇంధనం అయిపోవడంతో శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అనంతరం విమానంలో ఇంధనం నింపుతుండగా సిబ్బంది లీక్ ను గుర్తించారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని నిలిపేశారు. అనంతరం రన్ వేపై లీకైన ఇంధనాన్ని అగ్నిమాపక శకటాలతో శుభ్రం చేశారు. లీకేజీని సిబ్బంది సకాలంలో గుర్తించకపోయి ఉంటే.. విమానం టేకాఫ్ సమయంలో పెను ప్రమాదం జరిగి ఉండేదని అధికారులు పేర్కొన్నారు. 
city airways flight
Hyderabad
shamshabad airport

More Telugu News