Tripura: త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ రాజీనామా

  • గవర్నర్ కు రాజీనామా లేఖ సమర్పించిన మాణిక్ సర్కార్
  • కొత్త ముఖ్యమంత్రి వచ్చే వరకూ ఆ పదవిలో కొనసాగనున్న వైనం
  • ఇన్నేళ్లుగా సహకరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన మాణిక్ సర్కార్
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిన్న వెలువడిన విషయం తెలిసిందే. సీపీఎం 16 సీట్లు గెలుచుకోగా, బీజేపీ-పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర కూటమి 43 సీట్లు సాధించడం విదితమే. ఈ నేపథ్యంలో త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ తన పదవికి ఈరోజు రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ తథాగత రాయ్ కి సమర్పించారు.

కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే వరకూ ఆ పదవిలో కొనసాగాలని మాణిక్ సర్కార్  కు గవర్నర్ సూచించారు. అనంతరం, మాణిక్ సర్కార్ మీడియాతో మాట్లాడుతూ, ఇన్నేళ్లు తమకు సహకరించిన ప్రజలు, అధికారులకు ధన్యవాదాలని, వారి సహకారం వల్లే ఇన్నేళ్ల పాటు తమ పాలన కొనసాగిందని అన్నారు.
Tripura
manik sarkar
resignation

More Telugu News