Pawan Kalyan: మిత్రపక్షం టీడీపీ నుంచి పవన్ ముందుగా బయటపడాలి : వైసీపీ నేత బొత్స
- జేఎఫ్సీ నివేదికతో రాష్ట్రానికి, ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు
- కేంద్రం నిధులివ్వకుంటే అడగాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే
- ఈ విషయమై పవన్ ఎందుకు ప్రశ్నించరు?: బొత్స
మిత్రపక్షం టీడీపీ నుంచి పవన్ కల్యాణ్ ముందుగా బయటపడాలని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ సూచించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జేఎఫ్సీ నివేదికతో రాష్ట్రానికి, ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదని, కేంద్రం నిధులు ఇవ్వకుంటే అడగాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, ఈ విషయమై పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు.
కేంద్రంపై అవిశ్వాసాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేయొద్దని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ పార్టీతో నైనా కలిసి పోరాటానికి వైసీపీ సిద్ధంగా ఉందని మరోసారి బొత్స స్పష్టం చేశారు. కాగా, వైసీపీకి చెందిన మరో నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ వైఫల్యాలలో పవన్ కూడా భాగస్వామియేనని, కేవలం కేంద్రానిదే తప్పు అనేలా జేఎఫ్సీ నివేదిక ఉందని విమర్శించారు. టీడీపీ నుంచి పవన్ బయటకు వచ్చి తమకు మద్దతు ఇవ్వాలని కోరారు.