cpi: ప్రత్యేక హోదా కోసం వామపక్షాల వినూత్న నిరసన

  • కేంద్ర ప్రభుత్వం తీరుపై వామపక్షాల నిరసన
  • అనంతపురంలోని క్లాక్ టవర్ నుంచి భిక్షాటన చేసిన నేతలు
  • ప్రధాన వీధుల గుండా తిరిగిన వైనం
ఏపీ ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చకపోవడంపై వామపక్షాలు వినూత్న నిరసన వ్యక్తం చేశాయి. అనంతపురంలో సీపీఎం, సీపీఐ సహా వామపక్ష పార్టీలు క్లాక్ టవర్ వద్ద నుంచి భిక్షాటన చేశాయి. ప్రధాన వీధుల మీదుగా భిక్షాటన చేస్తూ వామపక్ష నాయకులు తిరిగారు. ఈ సందర్భంగా ఏపీకి జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించారు. విభజన హామీలు అమలు చేయకుండా కేంద్రం చేస్తున్న మోసాలు ఎన్నో రోజులు సాగవని, ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించే వరకు తమ పోరాటం ఆగదని వామపక్ష నేతలు స్పష్టం చేశారు.
cpi
cpm
anatapuram

More Telugu News