raasi khanna: హీరోయిన్ రాశీ ఖన్నాకు షేక్ హ్యాండ్ ఇచ్చిన రోబో 'మిత్రా'

  • పీపుల్స్ ప్లాజాలో షీటీమ్స్ ప్రదర్శన
  • కార్యక్రమంలో పాల్గొన్న రోబో మిత్రా
  • రాశీకి షేక్ హ్యాండ్ ఇచ్చి అందర్నీ ఆకట్టుకున్న రోబో
ప్రముఖ సినీ నటి రాశీ ఖన్నాకు బెంగళూరు రోబో మిత్రా షేక్ హ్యాండ్ ఇచ్చింది. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాల్లో భాగంగా షీ టీమ్ ఓ ప్రదర్శనను నిర్వహించింది. దీనిని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రా... రాశీ ఖన్నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి అందరినీ ఆకట్టుకుంది. ఈరోజు, రేపు పీపుల్స్ ప్లాజాలో నిర్వహించే పలు విషయాలపై రోబో మిత్రా అవగాహన కల్పించనుంది. ఈ సందర్భంగా నిర్వహించే 10కే రన్ లో సైతం ఇది వాక్ చేయనుంది. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ లో కూడా ప్రధాని మోదీ, ఇవాంకా ట్రంప్ లతో కలసి మిత్రా సందడి చేసింది. 
raasi khanna
robot
mitra
she teams

More Telugu News