Pawan Kalyan: కాసేపట్లో ప్రజల ముందుకు జేఎఫ్‌సీ నివేదిక.. వాస్తవాలు వెల్లడించనున్న పవన్‌ కల్యాణ్‌!

  • ఏపీకి కేంద్ర ప్రభుత్వం చేసిన సాయంపై నివేదిక
  • ప్రజలకు వివరించనున్న నేతలు
  • హైదరాబాద్‌లో కొనసాగుతోన్న సమావేశం
జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ చొరవతో సంయుక్త నిజ నిర్ధారణ కమిటీ (జేఎఫ్‌సీ) ఏర్పాటైన విషయం తెలిసిందే. ఏపీకి కేంద్ర ప్రభుత్వం చేసిన సాయంపై ఆ క‌మిటీ ఇటీవ‌ల‌ నివేదిక అందించింది. ఈ నివేదికలోని పూర్తి వివరాలను కాసేప‌ట్లో విడుదల చేసే అవ‌కాశం ఉంది.

ప్ర‌స్తుతం హైదరాబాద్‌లో జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ తుది నివేదిక రూపకల్పన సమావేశం జరుగుతోంది. లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య, ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ప్ర‌స్తుతం ఆ నివేదిక‌ను ప‌రిశీలిస్తున్న‌ట్లు జ‌న‌సేన‌ తెలిపింది.
Pawan Kalyan
Jayaprakash Narayan
Hyderabad

More Telugu News