balakrishna: బాలయ్య దర్శకత్వంలోనే ఎన్టీఆర్ బయోపిక్?

  • ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో ఆలస్యం 
  • అసంతృప్తికి లోనైన బాలకృష్ణ 
  • ఆయనే దర్శకుడంటూ ప్రచారం
తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ రూపొందనుందనీ .. ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణ చేయనున్నాడనే సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఎన్టీఆర్ వర్ధంతి రోజైన జనవరి 18న లాంచ్ చేశారు. ఈ పాటికే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకావలసి వుంది. అయితే తేజ .. వెంకటేశ్ తో ఒక సినిమా చేస్తూ బిజీగా వున్నాడు. దాంతో ఎన్టీఆర్ బయోపిక్ మరింత ఆలస్యం అవుతుందనే విషయం స్పష్టమవుతోంది.

ఇక ఈ సినిమాకి బాలకృష్ణనే దర్శకత్వం వహించనున్నాడనేది తాజా సమాచారం. ఈ ప్రాజెక్టు పట్ల తేజ అంతగా ఆసక్తిని చూపకపోవడం .. ఆయన ధోరణి పట్ల బాలకృష్ణ అసంతృప్తిగా వున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇక సమయాన్ని వృథా చేయకూడదనే ఉద్దేశంతో బాలకృష్ణనే దర్శకత్వ బాద్యతలను స్వీకరించాలని నిర్ణయించుకున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.    
balakrishna
teja

More Telugu News