meghalaya: హంగ్ దిశగా మేఘాలయ ఫలితాలు

  • ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యతను ఇవ్వని ఓటర్లు
  • ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 30 సీట్లు రావాలి
  • 27 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్న కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మేఘాలయలో... హంగ్ దిశగా ఫలితాలు వస్తున్నాయి.  ఏ పార్టీకి కూడా ఓటర్లు స్పష్టమైన ఆధిక్యాన్ని ఇవ్వలేదు. మొత్తం 59 సీట్లున్న మేఘాలయలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే... 30 సీట్లను సాధించాలి. ఈ మెజారిటీ ఏ పార్టీకి దక్కే అవకాశం లేదు.

తాజా ట్రెండ్స్ ప్రకారం... బీజేపీ కూటమి 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఎన్పీపీ 10 స్థానాలు, కాంగ్రెస్ 27 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 14 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నారు. కొంచెం అదృష్టం కలసి వస్తే... కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. 
meghalaya
elections
trends
hung

More Telugu News