Bill Gates: అమెరికా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే అవకాశం ఉంది: బిల్ గేట్స్ సంచలన వ్యాఖ్యలు

  • ఆర్థిక సంక్షోభం మరోసారి తలెత్తే అవకాశముంది
  • ఇన్నొవేషన్, క్యాపిటలిజం మెరుగైతే ప్రమాదం నుంచి బయటపడవచ్చు
  • 2008 ఆర్థిక సంక్షోభంతో 88 లక్షల ఉద్యోగాలను కోల్పోయిన అమెరికన్లు
2008లో తలెత్తిన ఆర్థిక సంక్షోభం అగ్రరాజ్యం అమెరికాను వణికించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ ప్రమాదం మరోసారి పొంచి ఉందా? అనే ప్రశ్నకు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ అవుననే సమాధానం ఇచ్చారు. 'ఆస్క్ మీ ఎనీథింగ్' అనే కార్యక్రమంలో పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా... 2008లో వచ్చిన ఆర్థిక సంక్షోభం సమీప భవిష్యత్తులో మళ్లీ వచ్చే అవకాశం ఉందా? అంటూ ఓ యూజర్ ప్రశ్నించారు.

దీనికి సమాధానంగా... ఔను అని పక్కాగా చెప్పడం కష్టమే అయినప్పటికీ... అలాంటి సంక్షోభం మరోసారి రావడం మాత్రం తథ్యమని బిల్ గేట్స్ సమాధానమిచ్చారు. ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశాలు ఉన్నాయని... అయితే ఇన్నొవేషన్, క్యాపిటలిజం మరింత మెరుగైతే దాన్నుంచి బయటపడవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

2008లో తలెత్తిన ఆర్థిక సంక్షోభంతో అమెరికా అతలాకుతలం అయింది. దాదాపు 88 లక్షల ఉద్యోగాలను అమెరికన్లు కోల్పోయారు. 19 ట్రిలియన్ డాలర్ల (రూ. 19 లక్షల కోట్ల డాలర్లు)కు పైగా ప్రజా సంపద హరించుకుపోయింది. నివాసాలను కోల్పోయిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.  
Bill Gates
economic crisis
america

More Telugu News