vijay devarakonda: విజయ్ దేవరకొండకు జోడీగా మెహ్రీన్

  • తమిళ మూవీలో విజయ్ దేవరకొండ
  • దర్శకుడిగా ఆనంద్ శంకర్ 
  • ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్
తెలుగు తెరపై గ్లామర్ కథానాయికగా మెహ్రీన్ మంచి మార్కులు సంపాదించుకుంది. 'రాజా ది గ్రేట్' తరువాత ఈ సుందరి చేసిన సినిమాలు పెద్దగా ఆడలేదు. దాంతో అవకాశాలు అంతగా పలకరించడం లేదు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ సరసన ఛాన్స్ లభించడం అమ్మడి కెరియర్ కి బాగా కలిసొచ్చే అంశమని అంటున్నారు.

తెలుగు ప్రేక్షకుల ముందుకు 'టాక్సీవాలా' .. 'ఏ మంత్రం వేశావే' చిత్రాలతో రానున్న విజయ్ దేవరకొండ, తమిళంలో ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఈ నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. పాత్ర పరంగా విజయ్ దేవరకొండ జోడీగా మెహ్రీన్ అయితే బాగుంటుందని భావించి ఆమెను ఎంపిక చేసినట్టు సమాచారం. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా విడుదలకానుంది.  
vijay devarakonda
ehreen

More Telugu News