Chittoor District: కుదువపెట్టిన నగలతో జూదమాడిన ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్ మేనేజర్

  • వి.కోట ముత్తూట్ ఫైనాన్స్ లో బ్రాంచ్ మేనేజర్ ప్రకాశ్
  • వినియోగదారుల 2 కేజీల బంగారు నగలను ష్యూరిటీగా పెట్టి క్రికెట్ బెట్టింగ్
  • ఓడిపోవడంతో బంగారం స్థానంలో నకిలీ నగలు
కుదువపెట్టిన నగలను జాగ్రత్తగా భద్రపరచాల్సిన బ్రాంచ్ మేనేజర్ వాటితో జూదమాడి, పోగొట్టుకుని, వాటి స్థానంలో నకిలీ నగలను పెట్టిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే... చిత్తూరు జిల్లా వి.కోట ముత్తూట్‌ ఫైనాన్స్‌ బ్రాంచ్ మేనేజర్‌ గా పని చేస్తున్న ప్రకాశ్ కు క్రికెట్ బెట్టింగ్ వ్యసనం ఉంది.

ఈ నేపథ్యంలో ఆయన తన బ్రాంచ్ లో వినియోగదారులు కుదువ పెట్టిన 2 కేజీల నగలను బెట్టింగ్ లో ష్యూరిటీగా పెట్టాడు. బెట్టింగ్ లో ఓడిపోవడంతో ఆ నగల స్థానంలో గుట్టుచప్పుడు కాకుండా నకిలీ బంగారు నగలను పెట్టాడు. ఇది వెలుగు చూడడంతో మనస్తాపం చెందిన ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 
Chittoor District
v.kota
muthoot finance

More Telugu News