navadeep: సినిమా టికెట్ బుక్ చేద్దామంటే ఈ మెసేజీ చూపిస్తోంది: నవదీప్

  • బుక్ మై షోలో టికెట్ బుక్ చేసే ప్రయత్నం చేసిన నవదీప్
  • టికెట్ బుకింగ్ స్థానంలో మెసేజీ ప్రత్యక్షం
  • స్క్రీన్ షాట్ తీసి, ఇన్ స్టాగ్రాంలో పోస్టు
నిన్నటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమాల ప్రదర్శన నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దానిని సూచిస్తూ హీరో నవదీప్ ఇన్‌ స్టాగ్రాంలో ఒక పోస్ట్ పెట్టాడు. సినిమా టికెట్స్ ను ఆన్ లైన్ మాధ్యమంగా బుక్ చేసుకునే యాప్ 'బుక్ మై షో'లో టికెట్ బుక్ చేసుకునేందుకు ప్రయత్నిస్తే ఒక మెసేజీ చూపిస్తోందని నవదీప్ తెలిపాడు.

బుక్ మై షోలో 'నౌ షోయింగ్' ఆప్షన్ ని క్లిక్ చేస్తే 'ఈ ఏరియాలో ఎటువంటి సినిమాలకు అవకాశం లేదు' అనే మెసేజ్ ప్రత్యక్షమవుతోంది. దానిని స్క్రీన్ షాట్ తీసి నవదీప్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేస్తూ, సమస్య త్వరగా పరిష్కరించబడాలని కోరుకున్నాడు. కాగా, స్ట్రెయిట్ సినిమాలపై డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్ల తీరును నిరసిస్తూ మార్చి2 నుంచి ఐదు రాష్ట్రాల్లో సినిమా థియేటర్ల బంద్‌ పాటించాలని ద‌క్షిణ భార‌త చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో నిత్యం కోలాహలంగా ఉండే థియేటర్లన్నీ మూగబోయాయి.
navadeep
actor
book my show
movie ticket

More Telugu News