Telangana: ప్రధానిని కేసీఆర్ తిడితే...కేటీఆర్ ని వివరణ అడగడమేంటి?: వీహెచ్

  • టీఆర్ఎస్, బీజేపీ విమర్శలు ఒక డ్రామా
  • కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర చేస్తే టీఆర్ఎస్ కు వచ్చిన నష్టమేంటి?
  • కేటీఆర్ బూతుపురాణంలో పీహెచ్డీ చేశారు
ప్రధాని నరేంద్ర మోదీని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తిడితే రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, మంత్రి కేటీఆర్‌ ను వివరణ అడగడమేమిటని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ప్రశ్నించారు. గాంధీభవన్ లో ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్, బీజేపీ విమర్శించుకోవడం ఒక డ్రామా అన్నారు. తెలంగాణ ఆకాంక్షలు నెరవేరుతాయన్న ఆశతో ప్రజలు టీఆర్ఎస్ కు ఓట్లేసి గెలిపించారని, అలా జరగకపోతే ఏం చెయ్యాలో వారికి తెలుసని ఆయన పేర్కొన్నారు.

ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర చేస్తే కేటీఆర్ కు వచ్చిన నష్టమేమిటని ఆయన నిలదీశారు. తిట్ల పురాణంలో కేటీఆర్‌ పీహెచ్‌డీ చేశారని, తండ్రి బాటలోనే తనయుడు నడుస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రధానిపై తిట్ల విషయంలో నిర్మలా సీతారామన్ ఆదిభట్లలో జరిగిన ప్రారంభోత్సవ సభకు వెళ్లకుండా నేరుగా కేసీఆర్ ని నిలదీయాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. 
Telangana
VH
criticism
Congress

More Telugu News