ashok gajapati raj: రాజీనామాకు సిద్ధపడ్డ అశోక్ గజపతిరాజు!

  • అమరావతిలో టీడీపీపీ సమావేశం
  • కేంద్రంలోని తమ మంత్రులతో రాజీనామా చేయించాలన్న ఎంపీలు 
  • చంద్రబాబు ఆదేశిస్తే పదవికి రాజీనామా చేస్తానన్న అశోక్ గజపతి 
  • అవసరమైనప్పుడు నిర్ణయం తీసుకుంటామన్న చంద్రబాబు
ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం జాతీయ స్థాయి పోరాటం నేపథ్యంలో కేంద్రంలోని తమ మంత్రులతో రాజీనామా చేయించాలని టీడీపీ ఎంపీలు సూచించారు.
అమరావతిలో జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ (టీడీపీపీ) సమావేశంలో ఎంపీలు ఈ సూచన చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఆదేశిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. రాష్ట్రపతి, ప్రధాని, స్పీకర్ కు రాజీనామా లేఖలు ఇస్తామని, రాజీనామా లేఖలు ఇప్పుడే ఇవ్వమన్నా ఇచ్చేస్తామని అశోక్ గజపతి రాజు అనగా, అవసరమైనప్పుడు నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తోంది.
ashok gajapati raj
Telugudesam

More Telugu News