vijay deverakonda: విజయ్ దేవరకొండ ట్వీట్ లో అసలు అర్థమది!

  • ‘నాకు కూడా బ్యాక్ లాగ్స్ ఉన్నాయబ్బా..’ అంటూ విజయ్ దేవరకొండ ట్వీట్
  • ఆ బ్యాక్ లాగ్స్ చదువుకు సంబంధించి కాదు 
  • విజయ్ దేవరకొండ నటించిన ‘ఏ మంత్రం వేసావె’ సినిమా గురించి
‘నాకు కూడా బ్యాక్ లాగ్స్ ఉన్నాయబ్బా..’ అంటూ హీరో విజయ్ దేవరకొండ చేసిన ఓ ట్వీట్ ఆసక్తికరంగా ఉంది. ‘ఇంట్లో తెలియకుండా మేనేజ్ చేద్దామని అనుకున్నా.. కానీ, ఐదేళ్ల తర్వాత ‘యూట్యూబ్’లో ట్రెండ్ అవుతోంది’ అని పేర్కొన్నాడు. అయితే, ‘బ్యాక్ లాగ్స్’ అనగానే విజయ్ దేవరకొండ చదువుకు సంబంధించిన సబ్జెక్ట్స్ ఏమైనా మిగిలి ఉన్నాయేమోననుకుంటే పొరపాటుపడ్డట్టే.

ఎందుకంటే, విజయ్ దేవరకొండ ప్రస్తావించింది 2014లో ప్రారంభమైన తన సినిమా ‘ఏ మంత్రం వేసావె’ గురించి. కొన్ని కారణాల వల్ల ఈ చిత్ర నిర్మాణం, విడుదల వాయిదా పడుతూ వచ్చింది. నిన్న విడుదలైన ఈ చిత్రం ట్రైలర్, ‘యూ ట్యూబ్’ ట్రెండింగ్ లో నాల్గో స్థానంలో ఉంది. అందుకే, ‘ఐదేళ్ల తర్వాత  ‘యూ ట్యూబ్’లో ట్రెండ్ అవుతోంది’ అని తన ట్వీట్ లో సరదాగా వ్యాఖ్యానించాడు. కాగా, శ్రీధర్ మర్రి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన శివానీ సింగ్ నటిస్తోంది.
vijay deverakonda
Tollywood

More Telugu News