omar abdullah: మరో పెళ్లి చేసుకుంటాను.. విడాకులిప్పించండి!: హైకోర్టులో కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ పిటిషన్

  • 1 సెప్టెంబర్ 1994లో పాయల్-ఒమర్ అబ్దుల్లా వివాహం
  • ఒమర్-పాయల్ దంపతులకు ఇద్దరు కుమారులు
  • 2009 నుంచి విడిగా ఉంటున్న పాయల్, ఒమర్
తన భార్య పాయల్ తో వివాహ బంధం తిరిగి కోలుకోలేనంతగా దెబ్బతింది కనుక, మరో వివాహం చేసుకునేందుకు ఆమెతో విడాకులిప్పించాలని జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. 1994, సెప్టెంబర్‌ 1న పాయల్ తో ఒమర్ అబ్దుల్లాకు వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. అయితే 2007లో ఒమర్‌–పాయల్‌ ల మధ్య తలెత్తిన మనస్పర్థలు తీవ్రరూపం దాల్చడంతో 2009 నుంచి వీరు విడిగా ఉంటున్నారు.

దీంతో 2016, ఆగస్టు 30న తనకు పాయల్‌ నుంచి విడాకులు మంజూరు చేయాలని కోరుతూ ఒమర్‌ ట్రయల్‌ కోర్టును ఆశ్రయించగా ఆ పిటిషన్ ను న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో తమ మధ్య బంధం తిరిగి కోలుకోలేనంతగా దెబ్బతిందని చెబుతూ, ఒమర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఒమర్ వాదనలు విన్న జస్టిస్‌ సిద్ధార్థ మ్రిదుల్, జస్టిస్‌ దీపా శర్మల ధర్మాసనం తదుపరి విచారణను ఏప్రిల్‌ 23కి వాయిదా వేసింది. ఆలోగా పాయల్ స్పందన తెలియజేయాలని న్యాయవాదిని ఆదేశించింది. 
omar abdullah
Jammu And Kashmir
payal
divorce

More Telugu News