Pari: మా ఆవిడను చూస్తే భయమేసేసింది: ట్విట్టర్ లో కోహ్లీ!

  • గత రాత్రి 'పరి' చూసిన విరాట్
  • భయపడ్డానని ట్విట్టర్ లో వెల్లడి
  • అనుష్క నటనతో గర్వపడుతున్నానని వ్యాఖ్య
  • నేడు విడుదల కానున్న 'పరి'
తన భార్య అనుష్క శర్మను చూసి భయపడ్డానని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. గత రాత్రి తాను ఆమె నటించిన 'పరి' చిత్రాన్ని చూశానని, తన భార్య మిగతా చిత్రాలతో పోలిస్తే అద్భుత నటనను ఇందులో చూపిందని వ్యాఖ్యానించాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టాడు. చాలాకాలంగా ఇంత మంచి చిత్రాన్ని తాను చూడలేదని చెప్పాడు. సినిమా చూసి తాను కొంత భయపడ్డానని, ఇదే సమయంలో ఆమె నటనకు ముగ్ధుడినై గర్వపడుతున్నానని వ్యాఖ్యానించాడు. కాగా, అనుష్క శర్మ నటించిన హారర్ చిత్రం 'పరి' నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే.
Pari
Anushka Sharma
Virat Kohli

More Telugu News