Jabardast: జబర్దస్త్, పటాస్ షోలు నిషేధించాలంటూ సంతకాలు చేస్తున్న వేలాది మంది!

  • రియాల్టీ షోల్లో మహిళలపై దారుణ వ్యాఖ్యలు
  • ఇటువంటి షోలు వద్దే వద్దు
  • సంతకాల సేకరణ ప్రారంభించిన ఏపీ మహిళా సమాఖ్య, ఐద్వా
తెలుగు టీవీ చానళ్లలో జబర్దస్త్, పటాస్ వంటి రియాల్టీ షోల్లో మహిళలను దారుణంగా కించపరుస్తున్నారని ఆరోపిస్తూ, వాటిని నిషేధించాలని డిమాండ్ చేస్తూ, విజయవాడలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో సంతకాల సేకరణ జరుగుతుండగా, వేలాది మంది మద్దతు తెలుపుతున్నారు.

 డబుల్ మీనింగ్ డైలాగులు నిండిన ఇటువంటి షోలను ప్రదర్శించరాదని, అశ్లీల వెబ్ సైట్లను తొలగించాలని కోరుతూ ఏపీ మహిళా సమాఖ్య, ఐద్వా తదితర సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అసభ్యకర షోలను ఆపేందుకు ప్రభుత్వం నడుం బిగించాలని మీడియా వాచ్ కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మహిళా నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకురాలు కె.శ్రీదేవి, విజయవాడ మహిళా సమాఖ్య ప్రెసిడెంట్ ఓ భారతి తదితరులు పాల్గొన్నారు.
Jabardast
Patas
TV Channels
Idwa

More Telugu News