kochi: క్రైస్తవ మతగురువును దారుణంగా హత్యచేసిన మాజీ ఉద్యోగి!

  • ఉద్యోగం నుంచి తొలగించడంతో కక్ష పెంచుకున్న యువకుడు
  • వారోత్సవ ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళ్లిన మతగురువుపై దాడి
  • పరారీలో నిందితుడు.. గాలిస్తున్న పోలీసులు
క్రైస్తవ మతగురువు ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. ఆలయ మాజీ ఉద్యోగే ఆయనను దారుణంగా పొడిచి చంపాడు. కేరళలోని కొచ్చిలో జరిగిందీ ఘటన. మలయత్తూర్‌లోని ప్రఖ్యాత సిరియన్-మలబార్ క్యాథలిక్ పుణ్యక్షేత్రం అధిపతి అయిన జేవియర్ థెలక్కట్ (52)పై కక్ష పెంచుకున్న మాజీ ఉద్యోగి ఈ దారుణానికి పాల్పడ్డాడు. పుణ్యక్షేత్రానికి సమీపంలోని కురుసుముడి కొండపై అతి త్వరలో ఆధ్యాత్మిక వారోత్సవాలు జరగనున్నాయి.

ఈ ఏర్పాట్లను పరిశీలించేందుకు కొండపైకి వెళ్తున్న జేవియర్‌ను గమనించిన మాజీ ఉద్యోగి జానీ దాడిచేసి పదునైన ఆయుధంతో పొడిచి చంపి పరారయ్యాడు. మూడు నెలల క్రితం విధుల నుంచి జానీని తొలగించడంతో జేవియర్‌పై కక్ష పెంచుకున్నాడు. పగ తీర్చుకునేందుకు అదును కోసం ఎదురుచూస్తున్న జానీ ఆయన కనిపించగానే పదునైన ఆయుధంతో దాడిచేసి హతమార్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జానీ కోసం గాలిస్తున్నారు.
kochi
Kerala
Christian
Murder

More Telugu News