mekapati rajamohan reddy: చెక్ బౌన్స్ కేసులో వైసీపీ ఎంపీ మేకపాటి బంధువులకు చుక్కెదురు

  • చెక్ బౌన్స్ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్లు
  • రూ. 1.73 కోట్ల చెక్ బౌన్స్ కేసు
  • కోర్టుకు హాజరుకాకపోవడంతో వారెంట్లు
వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి బంధువులకు హైదరాబాదులోని కోర్టులో చుక్కెదురైంది. రూ. 1.73 కోట్ల చెక్ బౌన్స్ కేసును కోర్టు నేడు విచారించింది. అయితే కేసు విచారణకు మేకపాటి బంధువులు హాజరుకాలేదు. దీంతో, ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు... మేకపాటి బంధువులు మేకపాటి రాజగోపాల్ రెడ్డి, మేకపాటి అభినవ్ రెడ్డి, మేకపాటి అభిషేక్ రెడ్డి, మేకపాటి శ్రీదేవి లకు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. వీరితో పాటు కొండా దేవిశ్రీప్రసాద్, మధుసూదన్ రెడ్డి, ఆదాల రచనారెడ్డి, సురేంద్రనాథ్, సదాత్ హుసేన్ అనే వ్యక్తులకు కూడా వారెంట్లు జారీ అయ్యాయి.  
mekapati rajamohan reddy
reletives
warrants

More Telugu News