Chandrababu: పొత్తులపై ఎన్నికల సమయంలో మాట్లాడదామని చంద్రబాబు చెప్పారు : టీడీపీ నేత రావుల

  • ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీటీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ
  • రాబోయే రోజుల్లో చేయాల్సిన కార్యక్రమాలు, రాజకీయ పరిస్థితులపై చర్చించాం
  • ప్రజల ఇబ్బందులు, కేంద్ర వైఖరిపైనా చర్చించామన్న రావుల
పొత్తులపై ఎన్నికల సమయంలో మాట్లాడదామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చెప్పారని టీటీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీ-టీడీపీ నేతలతో చంద్రబాబు ఈరోజు భేటీ అయ్యారు. ఈ భేటీ విషయమై రావుల మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో చేయాల్సిన కార్యక్రమాలు, రాజకీయ పరిస్థితులు, ప్రజల ఇబ్బందులు, కేంద్ర వైఖరిపై చర్చించామని చెప్పారు.

అసంపూర్తిగా ఉన్న కమిటీలను పూర్తి చేయాలని,  ఖమ్మంలో జరిగే సమావేశానికి రావాలని చంద్రబాబును కోరినట్లు చెప్పారు. బీజేపీతో పొత్తు విషయమై ఆయన మాట్లాడుతూ, పొత్తు ఉండదని బీజేపీ వాళ్లే అంటున్నారని అన్నారు. కాగా, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీటీడీపీ నేతలతో చంద్రబాబు నిన్న కూడా సమావేశమయ్యారు. తెలంగాణలో నెలకోసారి పర్యటించి పార్టీ పటిష్టతకు చర్యలు తీసుకుంటానని చంద్రబాబు గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే.  
Chandrababu
Telangana
ravula

More Telugu News