Ravela Kishore Babu: మాజీ మంత్రి రావెల వ్యాఖ్యలపై మంత్రి ప్రత్తిపాటి స్పందన

  • అక్రమ మైనింగ్ కు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం
  • ప్రభుత్వ అనుమతులతోనే మైనింగ్ జరపాలి
  • అక్రమాలు జరుగుతున్నట్టు కిషోర్ బాబు నాకు చెప్పారు
అక్రమ మైనింగ్ కు సంబంధించి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు చేసిన వ్యాఖ్యలపై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పందించారు. అక్రమ మైనింగ్ జరుగున్నట్టు తన దృష్టికి కిషోర్ బాబు తీసుకొచ్చారని... తన పేరు, ఆయన పేరు చెప్పుకుని అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పారని... అక్రమమైనింగ్ కు పాల్పడేవారు ఎవరైనా సరే, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అన్ని రకాల అనుమతులు ఉండి, చట్టపరంగా మాత్రమే మైనింగ్ చేయాలని అన్నారు. అక్రమ మైనింగ్ ను చంద్రబాబు ప్రభుత్వం సహించదని చెప్పారు. మైనింగ్ కు ప్రభుత్వ అనుమతులు తప్పనిసరి అని అన్నారు. తన నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరుగుతోందని... ఇప్పటికే రూ. 100 కోట్ల మట్టిని తవ్వుకుపోయారని కిషోర్ బాబు ఆరోపించిన సంగతి తెలిసిందే. 
Ravela Kishore Babu
prathipati pullarao
mining
illegal mining

More Telugu News