ఎన్ని సార్లు ఫోన్ చేసినా, బోనీ ఏడుస్తూనే ఉన్నాడు: నటుడు, నిర్మాత సతీష్ కౌశిక్
- బోనీ, నేను 30 ఏళ్లుగా మంచి స్నేహితులం
- అంతిమ యాత్రకు ఇంత మంది రావడం ఎన్నడూ చూడలేదు
- శ్రీదేవి ఓ అత్యుత్తమ తల్లి
ఏ వ్యక్తి అంతిమ యాత్రకూ ఇంత మంది జనాలు రావడం తాను చూడలేదని సతీష్ కౌశిక్ అన్నారు. శ్రీదేవి మరణంతో దేశమంతా శోకసంద్రంలో మునిగిపోయిందని చెప్పారు. ఆమె మరణం ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపిందని అన్నారు. ఒక మంచి తల్లిగా ఉండటం ఆమెకు ఎంతో ఇష్టమైన వ్యాపకమని చెప్పారు. ఇద్దరు కుమార్తెల విషయంలో ఆమె అత్యుత్తమమైన తల్లిగా నిరూపించుకున్నారని అన్నారు.