indian army: ప్రతీకారం తీర్చుకున్న భారత సైనికులు.. ఇద్దరు పాక్ రేంజర్ల హతం

  • భారత సైన్యం కాల్పుల్లో పాక్ సైనికులు హతం
  • జమ్ముకశ్మీర్ నియంత్రణ రేఖ వద్ద కొనసాగుతున్న కాల్పులు
  • బందిపొరాలో ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టిన సైన్యం
అనునిత్యం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడవడం, సరిహద్దుల్లో కల్లోలం సృష్టించడం, భారత సైనికులను కిరాతకంగా హతమార్చడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న పాక్ ఆర్మీపై భారత జవాన్లు ప్రతీకారం తీర్చుకున్నారు. జమ్ముకశ్మీర్ లోని నియంత్రణ రేఖ వద్ద మన సైనికులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పాక్ రేంజర్లు హతమయ్యారు. ఇరువైపుల నుంచి ఎదురెదురు కాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు, బందిపొరాలో జరిగిన ఎన్ కౌంటర్లో ఓ ఉగ్రవాదిని సైనికులు మట్టుబెట్టారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టు సమాచారం అందటంతో... అక్కడకు వెళ్లిన సైనికులు ఈ ముష్కరుడిని కాల్చి చంపారు. మిగిలిన ఉగ్రవాదుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నారు. 
indian army
Pakistan
rangers
fire

More Telugu News