ayodhya: అయోధ్య వివాదాన్ని కోర్టు వెలుపల పరిష్కరించుకుంటేనే మేలు!: పండిట్ రవిశంకర్

  • అయోధ్య వివాదం సామరస్యంగా పరిష్కరించుకోవాలి
  • వివాదానికి కోర్టు వెలుపలే పరిష్కారం
  • రామమందిర నిర్మాణాన్ని ముస్లింలు వ్యతిరేకించడం లేదు
అయోధ్య వివాదం న్యాయస్థానాల్లో తేలేది కాదని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు పండిట్ రవిశంకర్‌ అన్నారు. అయోధ్య వివాదానికి దూరంగా ఉండాలని రవిశంకర్ ను బాబ్రీ యాక్షన్ కమిటీ కోరిన నేపథ్యంలో ఆయన స్పందిస్తూ, అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని ముస్లింలు పెద్దగా వ్యతిరేకించడం లేదని అన్నారు.

అయోధ్య వివాదాన్ని కోర్టు వెలుపల పరిష్కరించుకుంటే మేలని ఆయన అభిప్రాయపడ్డారు. లేని పక్షంలో కోర్టులో కేసును ఓడిపోయిన వారు తొలుత తీర్పును అంగీకరించినా, భవిష్యత్‌ లో దీనిపై గందరగోళం సృష్టించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.  బాబ్రీ మసీదు-రామజన్మభూమి కేసులో తుది విచారణను గత డిసెంబర్‌ 5న సుప్రీం కోర్టు ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ayodhya
ramajanmabhoomi
babri maszid
ravi shankar

More Telugu News