singanna dora: టీడీపీ మాజీ ఎమ్మెల్యే సింగన్న దొర గుండెపోటుతో మృతి

  • కాసేపటి క్రితం ప్రాణలు వదిలిన సింగన్న దొర
  • ఆసుపత్రికి తరలించే లోపలే మృతి
  • సంతాపం తెలిపిన టీడీపీ నేతలు
టీడీపీ మాజీ ఎమ్మెల్యే పూనెం సింగన్న దొర కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆయనను ఆసుపత్రికి తరలించే లోపలే ప్రాణాలు వదిలారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. 1994-99 మధ్య కాలంలో ఆయన పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. సింగన్న దొర మరణవార్త తెలుసుకున్న టీడీపీ నేతలు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు.
singanna dora
dead
polavaram
Telugudesam

More Telugu News