khushboo: ఖుష్బూకు ఊహించని పరాభవం.. కోడిగుడ్లు, టమోటాలతో దాడి!

  • స్త్రీల మానంపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఖుష్బూ
  • 2015లో ఘటన
  • కోర్టుకు వచ్చిన సందర్భంగా దాడి
ప్రముఖ సినీ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ ఊహించని పరాభవాన్ని ఎదుర్కొన్నారు. ఆమె ప్రయాణిస్తున్న కారుపై నిరసనకారులు కోడిగుడ్లు, టమోటాలతో దాడి చేశారు. వివరాల్లోకి వెళ్తే, 2015లో స్త్రీల మానం గురించి ఆమె కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఆమెపై కేసులు నమోదయ్యాయి. కేసు విచారణకు గాను ఆమె తమిళనాడులోని మేటూర్ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె కారుపై దాడి జరిగింది. విచారణ సమయంలో ఖుష్బూను మేజిస్ట్రేట్ కొన్ని ప్రశ్నలు వేశారు. ఆమె చెప్పిన సమాధానాలను విన్న తర్వాత తదుపరి విచారణను మార్చి 6వ తేదీకి వాయిదా వేశారు. 
khushboo
court
attack

More Telugu News