Allu Arjun: ఇరవై లక్షలకు చేరిన బన్నీ ట్విట్టర్‌ ఫాలోవర్ల సంఖ్య!

  • సోష‌ల్ మీడియాలో త‌న కొత్త సినిమా విశేషాలు పంచుకుంటోన్న బన్నీ 
  • బన్నీ కొత్త సినిమా పోస్టర్ ఇంపాక్ట్‌ రేపు సాయంత్రం 4.30 గంటలకు విడుదల
  • ట్విట్టర్‌లో రెగ్యులర్‌గా పోస్టులు చేస్తోన్న అల్లు అర్జున్‌
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ట్విట్ట‌ర్ ఫాలోవ‌ర్ల సంఖ్య రెండు మిలియ‌న్ల‌కు చేరింది. సోష‌ల్ మీడియాలో ద్వారా ఆయ‌న త‌న కొత్త సినిమా విశేషాలు పంచుకుంటాడు. అప్ప‌ట్లో బన్నీ అరుదుగా ట్విట్ట‌ర్‌లో పోస్టులు చేసేవాడు. ఇప్పుడు మాత్రం రెగ్యులర్‌గా చేస్తూ అభిమానులను మరింత ఆకర్షిస్తున్నాడు. నిన్న శ్రీదేవి గురించి కూడా ఆయన ఓ పోస్టు చేసి, అసత్య ప్రచారాలు చేయొద్దని మీడియాను, అభిమానులను కోరిన విషయం తెలిసిందే.    ప్రస్తుతం ఆయన 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా ఓ పోస్ట్ చేసిన బన్నీ.. తన కొత్త సినిమా పోస్టర్ ఇంపాక్ట్‌ను రేపు సాయంత్రం 4.30 గంటలకు విడుదల చేస్తానని పేర్కొన్నాడు.
   
Allu Arjun
Twitter
na peru surya

More Telugu News