Chandrababu: టీటీడీపీ బాధ్యతలు జూనియర్ ఎన్టీఆర్ కు అప్పగించాలంటూ నినాదాలు!

  • హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో సమావేశం
  • టీటీడీపీని టీఆర్ఎస్ లో విలీనం చేస్తే ఆత్మహత్యలు చేసుకుంటాం
  • టీఆర్ఎస్ తో పాటు బీజేపీతోనూ టీడీపీకి పొత్తులు వద్దు
  • కార్యకర్తల నినాదాలు..సముదాయించిన చంద్రబాబు
టీటీడీపీ బాధ్యతలు ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ కు అప్పగించాలంటూ సీఎం చంద్రబాబునాయుడు ముందే ఆ పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో పార్టీ నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు ఈరోజు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు ముందే కార్యకర్తలు ఈ నినాదాలు చేశారు. టీటీడీపీని టీఆర్ఎస్ లో విలీనం చేస్తే ఆత్మహత్యలు చేసుకుంటామని, తెలంగాణలో టీఆర్ఎస్ తో పాటు బీజేపీతో కూడా టీడీపీ పొత్తు పెట్టుకోవద్దంటూ కార్యకర్తలు నినాదాలు చేయగా వారిని చంద్రబాబు సముదాయించినట్టు సమాచారం. కార్యకర్తల అభిప్రాయం మేరకే పొత్తులు ఉంటాయని చంద్రబాబు చెప్పినట్టు సమాచారం.
Chandrababu
junior ntr
Telangana

More Telugu News