Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ కు ముహూర్తం ఖరారు!

  • వచ్చేనెల 8వ తేదీన బడ్జెట్‌
  • ఉదయం 11.30 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి యనమల
  • ప్రజాకర్షకంగా ఉంటుందని విశ్లేషకుల అంచనా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వచ్చేనెల 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు ఈ రోజు స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్ ముహూర్తం ఖరారు చేసినట్లు తెలిపారు. వచ్చేనెల 8వ తేదీ ఉదయం 11.30 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.

కాగా, వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్ ప్రజాకర్షకంగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్‌పై యనమల రామకృష్ణుడు ఇప్పటికే మంత్రులు, అధికారులతో చర్చించి, అన్ని వివరాలు తీసుకున్నారు.    
Andhra Pradesh
assembly
Yanamala
ap budget

More Telugu News