Sridevi: ఇటువంటి ప్రశ్నలు అడగడం మీడియా విధి: శ్రీదేవి మృతిపై బాలీవుడ్ నటుడు

  • మీడియా అడిగే ప్రశ్నలను డస్ట్ బిన్‌లో పడేయాలా? వద్దా? అన్నది ప్రజలు నిర్ణయించుకుంటారు
  • శ్రీదేవి కుటుంబం చాలా బాధలో ఉంది
  • చిన్న వయసులోనే శ్రీదేవి కుమార్తెలు తమ తల్లిని కోల్పోయారు-అన్నూ కపూర్‌
సినీన‌టి శ్రీదేవి దుబాయ్‌లోని హోటల్‌లో బాత్‌టబ్‌లో పడి మృతి చెందిన ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతోన్న విషయం తెలిసిందే. 'బాత్‌టబ్‌లో పడితే ఎలా చనిపోతారు? ముందు గుండెపోటు వచ్చిందని ఎందుకు చెప్పారు?' అంటూ మీడియా అడుగుతోన్న ప్రశ్నల పట్ల బాలీవుడ్ నటుడు అన్నూ కపూర్ స్పందించారు. ముంబయిలోని సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్‌లో శ్రీదేవికి ఆయన నివాళులర్పించి మీడియాతో మాట్లాడారు.

ఇటువంటి ప్రశ్నలు అడగడం మీడియా విధి అని, వాటిని డస్ట్ బిన్‌లో పడేయాలా? వద్దా? అన్నది ప్రజలు నిర్ణయించుకుంటారని అన్నూ కపూర్‌ వ్యాఖ్యానించారు. కాగా, శ్రీదేవి కుటుంబం చాలా బాధలో ఉందని ఆయన అన్నారు. చిన్న వయసులోనే శ్రీదేవి కుమార్తెలు తమ తల్లిని కోల్పోయారని ఆయన విచారం వ్యక్తం చేశారు.   
Sridevi
funeral ceremony
Bollywood

More Telugu News