High Court: దిద్దిన, వైట్ నర్ వాడిన గ్రూప్-2 జవాబు పత్రాల పరిశీలనకు హైకోర్టు నిర్ణయం
తెలంగాణలో గ్రూప్-2 ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించి.. జవాబులను దిద్దినట్లు ఉన్న, వైట్ నర్ వినియోగించిన ఓఎంఆర్ జవాబు పత్రాలను పరిశీలించాలని ఉమ్మడి హైకోర్టు నిర్ణయించింది. ఇందుకోసం ముగ్గురు న్యాయవాదులను నియమించాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. శని, ఆదివారాల్లో ఈ ఓఎంఆర్ జవాబు పత్రాలను పరిశీలించాలని, మూడు వారాల్లో పరిశీలన నివేదికను తమ ముందుంచాలని సూచించింది. ఈ మేరకు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 19వ తేదీకి వాయిదా వేసింది.