priya varrier: శ్రీదేవి మృతి పట్ల నివాళి తెలుపుతూ పాట పాడిన ప్రియా వారియర్‌

  • ‘తుమ్‌ కభి హై ఖబర్‌ ముఝ్ కో భి.. హో రహా హే జుదా..’ పాట పాడిన ప్రియా
  • ‘కభి అల్విదా నా కెహనా’ (ఎప్పుడూ వీడ్కోలు చెప్పొద్దు) అనే సినిమాలోనిది ఆ పాట
  • చరిత్ర ఎప్పుడూ వీడ్కోలు పలకదు: ప్రియా
  • తరువాత‌ కలుద్దామ‌ని మాత్ర‌మే చెబుతుంది
సినీన‌టి శ్రీదేవి మృతి ప‌ట్ల  మలయాళ సినిమా 'ఒరు అదార్ లవ్' మూవీ నటి ప్రియా ప్రకాశ్ వారియర్ విచారం వ్య‌క్తం చేసింది. తాజాగా ఆమె ఓ వీడియోను పోస్ట్ చేసింది. గ‌తంలో కరణ్‌ జొహార్‌ తెరకెక్కించిన ‘తుమ్‌ కభి హై ఖబర్‌ ముఝ్ కో భి.. హో రహా హే జుదా..’ పాటను పాడుతూ ప్రియా వారియ‌ర్ నివాళులర్పించింది. చరిత్ర ఎప్పుడూ వీడ్కోలు పలకదని, తరువాత‌ కలుద్దామ‌ని మాత్ర‌మే చెబుతుందని ఆమె చెప్పింది. రెండు రోజుల ముందు కూడా ట్వీట్ చేస్తూ శ్రీదేవి మృతి వార్త తనను దిగ్భ్రాంతికి గురి చేసింద‌ని తెలిపింది.
priya varrier
Sridevi
song
Twitter

More Telugu News