ram gopal varma: ఆ పాట అంత్యక్రియలకు కూడా పనికొస్తుందని అనుకోలేదు: రామ్ గోపాల్ వర్మ

  • 'అమ్మ బ్రహ్మదేవుడా' అనే పాటను అంత్యక్రియలకు కూడా వాడుతున్నారు
  • శ్రీదేవిని పుట్టించినందుకు బ్రహ్మను కీర్తిస్తూ పాడే పాట అది
  • ఇలా జరుగుతుందని ఎన్నడూ అనుకోలేదు
తన అభిమాన నటి శ్రీదేవి మరణం తాలూకు విషాదం నుంచి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంకా బయటకు రాలేకపోతున్నారు. తాజాగా శ్రీదేవిని ఉద్దేశిస్తూ మరో ట్వీట్ చేశారు. 'గోవిందా గోవిందా' సినిమాలో 'అమ్మ బ్రహ్మ దేవుడో... కొంప ముంచినావురో' అంటూ నాగార్జున పాడే పాట... శ్రేదేవిని కీర్తించడంలో అత్యున్నతమైనదని అన్నారు. శ్రీదేవిని పుట్టించినందుకు బ్రహ్మను కీర్తిస్తూ పాడే పాట అది. అయితే, అదే పాటను అంత్యక్రియలకు కూడా వాడతారనే విషయాన్ని తాను ఎన్నడూ ఊహించలేకపోయానని అన్నారు.  

అంతకు ముందు నాగార్జున కూడా ఓ ట్వీట్ చేశారు. 'అనుకున్నామని జరగవు అన్నీ... అనుకోలేదని ఆగవు కొన్ని..' అంటూ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
ram gopal varma
nagrarjuna
sridevi

More Telugu News