Chandrababu: బీజేపీపై విమర్శలు గుప్పించిన చంద్రబాబు... వచ్చే ఎన్నికల్లో ఏమైనా జరగొచ్చన్న సీఎం

  • బీజేపీ, కాంగ్రెస్ లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి
  • లేకపోతే దేశానికి మంచిది కాదు
  • ప్రత్యేక హోదా రాయితీలు ఏపీకి ఇవ్వాల్సిందే
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై ఏపీ ముఖ్యమంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగేలా ఈ రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయని అన్నారు. దేశంలో ఎవరికైనా, ఏ రాష్ట్రనికైనా అన్యాయం జరిగితే... దేశంలోని ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లే బాధ్యత వహించాలని చెప్పారు. ఈ రెండు పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే... దేశానికి మంచిది కాదని అన్నారు. ప్రత్యేక హోదా రాయితీలను ఇతర రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు, ఏపీకి కూడా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికల్లో ఏమైనా జరగొచ్చంటూ భవిష్యత్ రాజకీయాలపై పరోక్ష సంకేతాలను పంపించారు.
Chandrababu
Special Category Status
BJP
Congress

More Telugu News