somu veerraju: నాకు పనికిమాలిన పదవి ఇచ్చి... భిక్ష వేశామని అంటున్నారు: సోము వీర్రాజు ఆగ్రహం

  • పనికిమాలిన ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు
  • దీని వల్ల ఎలాంటి ఉపయోగం లేదు
  • జీడీపీ ఎక్కువగా ఉన్నప్పుడు కేంద్రం నుంచి అప్పులు తీసుకోవచ్చు
తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల బీజేపీకే నష్టం కలిగిందని ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేనికీ ఉపయోగపడని, ఓ పనికిమాలిన ఎమ్మెల్సీ పదవిని తనకు ఇచ్చి.... తనకేదో భిక్ష వేశామన్నట్టుగా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.

లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయని... లక్షలాది ఉద్యోగాలు రానున్నాయని టీడీపీ నేతలు బీరాలు పలుకుతున్నారని... అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఏపీ జీడీపీ రేటు అధికంగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం వద్ద చంద్రబాబు సర్కారు అప్పు తీసుకోవచ్చని ఎద్దేవా చేశారు. 
somu veerraju
Andhra Pradesh
Telugudesam

More Telugu News