Sridevi: రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు శ్రీదేవి అంత్యక్రియలు!

  • సెలబ్రేషన్స్ క్లబ్ లో రేపు ఉదయం 9.30 నుంచి 12.30 వరకు భౌతికకాయం సందర్శనకు ఉంచుతారు 
  • మధ్యాహ్నం 2 గంటలకు అంతిమయాత్ర మొదలు, 3.30 గంటలకు అంత్యక్రియలు
  • శ్రీదేవి కుటుంబసభ్యుల అధికారిక ప్రకటన 
దుబాయ్ లో మృతి చెందిన ప్రముఖ నటి శ్రీదేవి భౌతికకాయంతో దుబాయ్ నుంచి ప్రత్యేక విమానం భారత్ బయలు దేరింది. ఈరోజు రాత్రి పది గంటలకు అది ముంబయ్ చేరుకోనున్నట్టు సమాచారం. అభిమానుల సందర్శనార్థం ఆమె భౌతికకాయాన్ని ముంబైలోని సెలబ్రేషన్స్ స్పోర్ట్స్ క్లబ్ లో రేపు ఉదయం 9.30 నుంచి 12.30 వరకు ఉంచుతారు. మధ్యాహ్నం 2 గంటలకు స్పోర్ట్స్ క్లబ్ నుంచి పవన్ హన్స్ వరకు అంతిమ యాత్ర కొనసాగుతుంది.

మధ్యాహ్నం 3.30 గంటలకు విలే పార్లే హిందూ శ్మశాన వాటికలో శ్రీదేవి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆమె కుటుంబ సభ్యులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. కాగా, ముంబైలోని శ్రీదేవి నివాసం వద్దకు ఆమె అభిమానులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. శ్రీదేవి కుమార్తెలు జాహ్నవి, ఖుషి కపూర్ తో పాటు ఇతర కుటుంబసభ్యులు అనిల్ కపూర్ నివాసం వద్ద వేచి ఉన్నట్టు సమాచారం.
Sridevi
mumbai

More Telugu News