Chandrababu: శ్రీదేవి మృతి పట్ల రకరకాల వాదనలు వస్తున్నాయి: ఏపీ సీఎం చంద్రబాబు

  • టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో శ్రీదేవికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం 
  • శ్రీదేవి మృతి బాధాకరం-చంద్రబాబు
  • ఆమె ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు
  • కొనసాగుతోన్న సమావేశం
అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం కొనసాగుతోంది. ఈ సందర్భంగా సమావేశం ప్రారంభంలో రెండు నిమిషాలు మౌనం పాటించి సినీనటి శ్రీదేవి మృతికి టీడీపీ నేతలు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... శ్రీదేవి మృతి పట్ల రకరకాల వాదనలు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఆమె ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకోవడం అరుదైన అంశమని కొనియాడారు.

కాగా, చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకుంటోన్న నేపథ్యంలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయనను అభినందిస్తూ టీడీపీ నేతలు ఓ తీర్మానాన్ని పెట్టారు. చంద్రబాబు నాయుడికి సంబంధించిన ఆనాటి జ్ఞాపకాలను సమన్వయ కమిటీ సమావేశంలో టీడీపీ నేతలు వివరిస్తున్నారు. సంక్షోభంలో సైతం అవకాశాలను వెదకడంలో తనకు తానే సాటిగా చంద్రబాబు నిలిచారని పేర్కొన్నారు. 
Chandrababu
Andhra Pradesh
Sridevi

More Telugu News