Adilabad: సీఎం కేసీఆర్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ లో పొగ.. తప్పిన ప్రమాదం..!

  • హెలికాప్టర్‌లోని విహెచ్ఎఫ్ కిట్ నుంచి బయటకొచ్చిన పొగ
  • బ్యాగును చాకచక్యంగా బయటపడేసిన భద్రతా సిబ్బంది
  • సీఎం బాగానే ఉన్నారని, టూర్ కొనసాగుతుందన్న కేటీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రమాదం తప్పింది. ఆదిలాబాద్ పర్యటనకు ఆయన బయలుదేరిన హెలికాప్టర్‌లోని ఓ విహెచ్ఎఫ్ కమ్యూనికేషన్ సెట్‌ ఉన్న బ్యాగు నుంచి ఉదయం 10.30 గంటల ప్రాంతంలో పొగ రావడాన్ని గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ బ్యాగును చాకచక్యంగా బయట పడేశారు.

ఈ ఘటనపై ఆయన కుమారుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో స్పందించారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయాన్ని తాను ఫోన్‌లో సంప్రదించానని, సీఎంకి ఎలాంటి ప్రమాదం జరగలేదని ఆయన చెప్పారు. సీఎం తన ఆదిలాబాద్ పర్యటనను కొనసాగిస్తారని కేటీఆర్ తెలిపారు.
Adilabad
KTR
CM KCR

More Telugu News