Bony kapoor: శ్రీదేవి పేరిట వంద కోట్లకు లైఫ్ ఇన్సూరెన్స్...?

  • మూడు రోజులుగా మార్చురీలోనే మృతదేహం
  • నేడు మరోసారి పోస్టుమార్టం
  • ఆమె భౌతికకాయం కోసం అభిమనుల ఎదురుచూపులు
శ్రీదేవి మరణం చుట్టూ పలు అనుమానాలు అలముకుంటున్నాయి. ఆమె మరణం సహజమా? అసహజమా? అనే విషయాన్ని తేల్చే పనిలో దుబాయ్ పోలీసులు నిమగ్నమయ్యారు. ఆమె మరణం అసహజమన్న కోణంలో విచారిస్తున్న పోలీసులు ఆమె భౌతికకాయానికి ఈ రోజు మరోసారి శవపరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిసింది.

మరోవైపు ఆమె పేరిట రూ.100 కోట్ల జీవితబీమా (లైఫ్ ఇన్సూరెన్స్) ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే విషయమై బోనీ కపూర్‌ను పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, మూడు రోజులుగా మార్చురీలోనే శ్రీదేవి భౌతికకాయం అనాథలా పడి ఉందని అక్కడి మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఆమె తలపై లోతైన గాయాలున్నట్లు చెబుతున్నారు. మరోవైపు ఆమె భౌతికకాయం ఎప్పుడు ముంబైకి చేరుకుంటుందా? అని ఆమె అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
Bony kapoor
Dubai
Sridevi

More Telugu News