raviteja: షూటింగులో రవితేజకి ఎలాంటి ప్రమాదం జరగలేదు: దర్శకుడు కల్యాణ్ కృష్ణ

షార్ట్స్‌లో చూడండి
ఒక వైపున యూత్ ను .. మరో వైపున ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే కంటెంట్స్ ను ఎంచుకుంటూ, కల్యాణ్ కృష్ణ విజయాలను అందుకుంటూ వున్నాడు. ప్రస్తుతం ఆయన రవితేజతో 'నేల టికెట్' సినిమాను చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ సినిమా షూటింగ్ సమయంలో రవితేజ గాయపడినట్టుగా ఒక వార్త హల్ చల్ చేస్తోంది. దాంతో ఆయన అభిమానులు ఆందోళనకి లోనయ్యారు.

 ఈ నేపథ్యంలో దర్శకుడు కల్యాణ్ కృష్ణ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ .. ఇదంతా కేవలం పుకారు మాత్రమేననీ ..ఇందులో ఎలాంటి నిజం లేదని చెప్పాడు. షూటింగు సమయంలో ఎలాంటి ప్రమాదం జరగలేదనీ .. ఎప్పటిలానే షూటింగులో రవితేజ చురుకుగా పాల్గొంటున్నాడని తెలిపాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. మాళవిక శర్మ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను ఈ వేసవిలో విడుదల చేయనున్నట్టు సమాచారం.     
Go Back to Shorts
raviteja
malavika

More Telugu News