nagashourya: తనపై నాగశౌర్య చేసిన విమర్శల గురించి స్పందించిన సాయిపల్లవి

  • నాగశౌర్య చేసిన విమర్శల గురించి చదివాను 
  • దర్శకుడికి ఫోన్ చేసి అడిగాను
  • నా వలన ఇబ్బంది పడితే బాధపడే తత్వం నాది
'ఫిదా' సినిమాతోను .. ఆ తరువాత విడుదలైన 'మిడిల్ క్లాస్ అబ్బాయ్'తోను సాయిపల్లవి సక్సెస్ లను సాధించింది. ఈ రెండు సినిమాలు యూత్ లో ఆమెకు విపరీతమైన క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. నాగశౌర్యతో కలిసి ఆమె తమిళంలో 'కరు' అనే సినిమా చేసింది. తెలుగులో ఈ సినిమాను 'కణం' పేరుతో విడుదల చేయనున్నారు.

 అయితే ఈ మధ్య సాయిపల్లవి గురించి నాగశౌర్య మాట్లాడుతూ అసహనానికి లోనయ్యాడు. సమయానికి ఆమె షూటింగుకి రాకపోవడం వలన తాను చాలా ఇబ్బంది పడినట్టుగా చెప్పాడు. ఆయన చేసిన విమర్శలపై తాజాగా సాయిపల్లవి మాట్లాడింది. 'నాగశౌర్య చేసిన కామెంట్స్ గురించి చదవగానే నేను 'కణం' దర్శకుడికి ఫోన్ చేసి .. తన వలన ఎవరైనా ఇబ్బంది పడ్డారా? అని అడిగాను .. అలాంటిదేం లేదని ఆయన చెప్పారు'. నా వలన ఎవరైనా ఇబ్బంది పడితే అది అవతలవారికన్నా నాకే ఎక్కువ బాధ కలిగించే విషయం అవుతుంది. అయినా నేను నాగశౌర్య వ్యక్తిగత అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాను' అని చెప్పుకొచ్చింది.   
nagashourya
sai pallavi

More Telugu News