Rashi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

షార్ట్స్‌లో చూడండి
*  అందాల రాశిఖన్నాకు పరిసరాలన్నీ ఎప్పుడూ నీట్ గా ఉండాలట. లేకపోతే తన చుట్టూ వున్న వాళ్ల మీద అరిచేస్తానంటోంది ఈ సుందరి. 'చిన్నప్పటి నుంచీ నాకు అన్ని విషయాల్లోనూ శుభ్రత అంటే ఎంతో ఇష్టం. అందుకే నా చుట్టూ వాతావరణం ఎప్పుడూ నీట్ గా వుండాలి. లేకపోతే కనుక పక్కనున్న వాళ్లు అయిపోయారన్నమాటే' అని చెప్పింది రాశి నవ్వుతూ.    
*  ఇటు సినిమాలతోను, అటు వాణిజ్య ప్రకటనలతోను బిజీగా వున్న మహేశ్ బాబు తాజాగా మరో ఉత్పత్తికి ప్రచారకర్తగా వ్యవహరించేందుకు సంతకం చేశాడు. ప్రోటీన్ సంబంధిత ఉత్పత్తి అయిన 'ప్రొటీనెక్స్'కు బ్రాండ్ అంబాసడార్ గా వ్యవహరిస్తాడు. ఇందుకు సంబంధించి సదరు సంస్థతో భారీ డీల్ కుదుర్చుకున్నాడు.
*  తెలుగు, తమిళ, హిందీ భాషల్లో చిత్రాలు చేస్తూ వస్తున్న హీరో మాధవన్ ప్రస్తుతం ఆసుపత్రిలో వున్నాడు. కుడి భుజానికి సర్జరీ చేయించుకున్నానని, ఆపరేషన్ సక్సెస్ అయిందని మాధవన్ పేర్కొన్నాడు. ప్రస్తుతం తెలుగులో 'సవ్యసాచి' చిత్రంలో మాధవన్ నటిస్తున్న సంగతి విదితమే.
*  సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో నాని నటించనున్నట్టు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ కోసం సంతోష్ ఓ కథ చేసుకున్నాడు. అయితే పవన్ రాజకీయాల్లోకి వెళుతున్నందున ఆ చిత్రం చేయడం సాధ్యపడడం లేదు. దీంతో ఆ కథకు కాస్త మార్పులు చేర్పులు చేసి నానికి చెప్పాడని, దానికి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.   
Go Back to Shorts
Rashi
Mahesh Babu
pavan
Nani

More Telugu News