Ram Gopal Varma: ఇదంతా చూస్తుంటే నన్ను నేను చంపుకోవాలనిపిస్తోంది: వర్మ

  • శ్రీదేవి మరణంపై ఆర్జీవీ తాజా ట్వీట్
  • ఆమె గురించి ఏవోవో మాట్లాడుకుంటున్నారని ఆవేదన
  • ఇలాంటి వార్తలు వినాల్సి రావడం బాధాకరమన్న వర్మ
అందాల నటి శ్రీదేవి మరణంతో విషాదంలో కూరుకుపోయిన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా మరోమారు తన ఆవేదనను వ్యక్తం చేశాడు. శ్రీదేవి జీవించి ఉన్నప్పుడు ఆమె అందం, శరీరం, హావభావాలు, పెదాలు, నడుము గురించి మాట్లాడుకునే వారని... కానీ, ఇప్పుడు ఏవోవే మాట్లాడుకుంటున్నారని అన్నాడు.

ఆమె రక్తంలో మద్యం ఉందని, ఊపరితిత్తుల్లో నీళ్లు ఉన్నాయని, పొట్టలో ఇంకేవో ఉన్నాయని అంటున్నారని పేర్కొన్నాడు. ‘‘ఎవరి జీవితమన్నా ఇంత భయంకరంగా, ఇంత విషాదంగా ముగుస్తుందా? ఆమె మరణవార్తను ఇలా ఇన్ని రకాలుగా వినాల్సి రావడం బాధాకరం. ఇదంతా చూస్తుంటే నన్ను నేను చంపుకోవాలనిపిస్తోంది’’ అని వర్మ ట్వీట్ చేశాడు.
Ram Gopal Varma
Sridevi
Bollywood
Tollywood

More Telugu News