KTR: కేటీఆర్, నారా లోకేష్ ల లక్ష్యాలు ఇవే!

  • డిజిటల్ తెలంగాణే లక్ష్యమన్న కేటీఆర్
  • స్టార్టప్ కంపెనీలా ఏపీని డెవలప్ చేస్తున్నామన్న లోకేష్
  • ప్రపంచంతో పోటీపడటమే లక్ష్యమన్న యువనేత
మెరుగైన పౌర సేవల కోసం ఈగవర్నెన్స్ ను తీసుకొచ్చామని... రాష్ట్ర వ్యాప్తంగా 4,500 మీసేవ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్పారు. టీవ్యాలెట్ ద్వారా సులభమైన పద్ధతిలో లావాదేవీలు చేసుకునే వీలుంటుందని తెలిపారు. పౌర సేవల కోసం ఆర్టీఏ ఎంవ్యాలెట్ ను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. డిజిటల్ తెలంగాణే తమ లక్ష్యమని తెలిపారు.

మరోపక్క, ఏపీని స్టార్టప్ కంపెనీలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. సీఐఐ సదస్సులో స్టార్టప్స్ మీద జరుగుతున్న సెషన్ లో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర తలసరి ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ... కేవలం మూడున్నరేళ్లలో ఎన్నో సమస్యలను అధిగమించామని చెప్పారు. డిజైన్, తయారీ, సరఫరాలో ఎదిగేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని... పరిశ్రమల ఏర్పాటుకు పాలసీలను రూపొందించామని చెప్పారు. ప్రపంచంతో పోటీ పడటమే తమ లక్ష్యమని తెలిపారు.
KTR
Nara Lokesh

More Telugu News