manohar parikar: నిలకడగా పారికర్ ఆరోగ్యం... ఆందోళన అక్కర్లేదు: గోవా మంత్రి వెల్లడి

  • ముఖ్యమంత్రి క్షేమంగా ఉన్నారు
  • వైద్య మంత్రి విశ్వజిత్ రాణే ప్రకటన
  • నిన్న సాయంత్రం కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరిన పారికర్
అస్వస్థతకు గురై గోవా మెడికల్ కళాశాల ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆరోగ్యం నిలకడగానే ఉంది. పారికర్ తీవ్ర అస్వస్థతతో ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొంది ఈ నెల 22నే డిశ్చార్జ్ అయ్యారు. అదే రోజు గోవా అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. నిన్న సాయంత్రం ఉన్నట్టుండి కడుపులో నొప్పి రావడంతో ఆయన్ను గోవా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించారు. దీనిపై ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణే స్పందిస్తూ... ముఖ్యమంత్రి క్షేమంగానే ఉన్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని స్పష్టం చేశారు. పారికర్ ను ఆస్పత్రిలో చేర్పించిన సమయంలో ఆయన డీహైడ్రేషన్ తో బాధపడుతున్నట్టు వైద్యులు తొలుత ప్రకటించారు.
manohar parikar
goa cm

More Telugu News