sai dharam tej: త్వరలో సెట్స్ పైకి కిషోర్ తిరుమలతో సాయిధరమ్ తేజ్
- కరుణాకరన్ తో సెట్స్ పై సాయిధరమ్ తేజ్
- తరువాత సినిమా గోపీచంద్ మలినేనితో
- కిషోర్ తిరుమలకి గ్రీన్ సిగ్నల్
సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం కరుణాకరన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగానే గోపీచంద్ మలినేనితో ఓ సినిమాను లైన్లో పెట్టాడు. ఈ క్రమంలోనే కిషోర్ తిరుమలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. రామ్ తో 'నేను శైలజ' .. 'ఉన్నది ఒకటే జిందగీ' చేసిన కిషోర్ తిరుమల, ఆ తరువాత నానికి ఒక కథ వినిపించాడు.
ఈ కథ విషయంలో నాని సంతృప్తి చెందకపోవడంతో, అదే కథతో సాయిధరమ్ తేజ్ ను కిషోర్ తిరుమల ఒప్పించాడని అంటున్నారు. గోపీచంద్ మలినేని సినిమాతో పాటు కిషోర్ తిరుమల సినిమా కూడా మే నెలలో సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. మైత్రీ మూవీస్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమాలో కథానాయిక ఎవరనేది త్వరలోనే తెలియనుంది. వరుస పరాజయాలతో వున్న సాయిధరమ్ తేజ్, ఈ ఏడాది మరో మూడు సినిమాలతో పలకరించనున్నాడన్న మాట.