nagarjuna: నాగార్జున సరసన మరోసారి అనుష్క!

  • మల్టీస్టారర్ లో నాగ్ .. నాని 
  • కథానాయికలుగా అనుష్క .. శ్రద్ధా శ్రీనాథ్
  • మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్  
శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ ఒక మల్టీస్టారర్ సినిమాను నిర్మిస్తున్నారు. మార్చి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలో ఒక హీరోగా నాగార్జున నటించనుండగా .. మరో హీరోగా నాని కనిపించనున్నాడు. మాఫియా డాన్ పాత్రను నాగార్జున పోషించనుండగా .. డాక్టర్ పాత్రను నాని చేయనున్నాడు.

ఈ సినిమాలో నానికి జోడీగా చేయడానికిగాను రీసెంట్ గా శ్రద్ధా శ్రీనాథ్ ను ఎంపిక చేశారు. దాంతో నాగార్జున సరసన కథానాయికగా ఎవరు కనిపించనున్నారనే ఆసక్తి అందరిలో మొదలైంది. ఆయన సరసన నాయికగా అనుష్కను తీసుకోనున్నారనేది తాజా సమాచారం. నాగార్జున 'సూపర్' సినిమాతోనే తెలుగు తెరకి పరిచయమైన అనుష్క, ఆ తరువాత ఆయన సరసన డాన్ .. రగడ .. ఢమరుకం చేసింది. ఈ సినిమాతో మరోసారి ఈ జోడీ కనువిందు చేయనుందన్న మాట. 
nagarjuna
anushka'
nani

More Telugu News