sridevi: శ్రీదేవి మృతిలో ట్విస్ట్.. ఆమెది సహజ మరణం కాదా?

  • శ్రీదేవి మరణించినప్పడు బోనీకపూర్ ఇండియాలో ఉన్నట్టు సమాచారం
  • డెడ్ బాడీని మొదట గుర్తించింది హోటల్ సిబ్బంది
  • తెరపైకి వస్తున్న పలు సందేహాలు
ప్రముఖ సినీ నటి శ్రీదేవి మృతి విషయంలో సరికొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటి వరకు అందరికీ తెలిసిన సమాచారం ప్రకారం శ్రీదేవి మరణించిన సమయంలో ఆమె భర్త బోనీకపూర్ కూడా హోటల్లోనే ఉన్నారు. ఆమె మరణించిన విషయాన్ని తొలుత ఆయనే గుర్తించారు. కానీ, ఇప్పుడు సంచలన వార్తలు (కొత్త సందేహాలు) వెలుగులోకి వస్తున్నాయి.

శ్రీదేవి మృతదేహాన్ని హోటల్ సిబ్బందే మొదట గుర్తించినట్టు సమాచారం. ఆమె చనిపోయినప్పుడు బోనీ కపూర్ ఇండియాలోనే ఉన్నారని చెబుతున్నారు. ఆమె మరణం పట్ల ఆమె కుటుంబసభ్యుల్లో కూడా పలు సందేహాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆమె మరణించిన 36 గంటల తర్వాత క్లియరెన్స్ ఇవ్వడంపై సందేహాలు తలెత్తుతున్నాయి.

యావత్ భారత దేశాన్ని కుదిపేసిన ఓ సెలబ్రిటీది సాధారణ మరణం అయినప్పుడు... క్లియరెన్స్ ఇవ్వడానికి ఇంత సమయం ఎందుకు పట్టిందని సందేహపడుతున్నారు. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ఆమె మరణంపై కుటుంబసభ్యులు స్పందించే అవకాశం ఉన్నట్టు సమాచారం.
sridevi
deatdh
doubts
twist

More Telugu News