radhika: హ్యాక్ కు గురైన నటి రాధిక ట్విట్టర్ అకౌంట్

  • స్వయంగా ప్రకటించిన నటి రాధిక
  • పరిష్కరించుకునే వరకు ఓపిక పట్టాలని ట్వీట్
  • ఆమె ప్రమేయం లేకుండా ట్వీట్లు
ప్రముఖ సీనియర్ నటి రాధిక ట్విట్టర్ అకౌంట్ ను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. నటి రాధిక తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కు గురైందంటూ రాధిక శరత్ కుమార్ పేరుతో ఉన్న తన ట్విట్టర్ పేజీలోనే పోస్ట్ చేశారు. దయచేసి దీన్నుంచి బయటపడే వరకు ఓపిక పట్టండంటూ ఆమె ట్వీట్ చేశారు. ట్విట్టర్ పేజీలో ఏవేవో సందేశాలు పోస్ట్ చేస్తుండడంతో రాధిక ఈ విషయాన్ని గుర్తించారు. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన రికార్డు రాధిక సొంతం. చిరంజీవి, రాధిక మంచి హిట్ కాంబినేషన్ అనే విషయం తెలిసిందే. కమలహాసన్ తో కలసి నటించిన 'స్వాతిముత్యం' అయితే నిజంగా ఆమె కెరీర్ లో ఓ ఆణిముత్యమే.
radhika
actor
twitter

More Telugu News